ఐసీఐసీఐ బ్యాంక్ టార్గెట్ రూ.1125!
ప్రైవేట్ బ్యాంకింగ్ రంగంలో క్రమంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వెనక్కి వెళుతోంది… ఆ స్థానంలోకి ఐసీఐసీఐ బ్యాంక్ ఆక్రమిస్తోంది. నిన్న ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకటించిన ఫలితాలు మార్కెట్ వర్గాలను విశేషంగా ఆకట్టుకుంది. తరవాత జరిగిన కాన్ఫరెన్స్ కాల్లో బ్యాంకు వెల్లడించిన సమాచారంతో అనేక బ్రోకింగ్ సంస్థలు ఐసీఐసీఐ బ్యాంక్ షేర్ టార్గెట్‌ను పెంచాయి. ముఖ్యంగా సీఎల్ఎస్ బ్యాంక్ తదుపరి టార్గెట్‌ను రూ.1125గా పేర్కొంది. ఐఐఎఫ్ఎల్ ఈ బ్యాంక్ షేర్ తుదపరి టార్గెట్ రూ. 950కి పెంచింది. కొటక్ సెక్యూరిటీస్ అంచనా ప్రకారం ఐసీఐసీఐ బ్యాంక్ టార్గెట్ రూ. 975. ఎమ్కే సంస్థ టార్గెట్‌ను రూ. 950 నుంచి రూ. 1025కు పెంచింది.
అనేక అంశాల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌ను ఐసీఐసీఐ బ్యాంక్ దాటేసింది. సీఎన్‌బీసీ టీవీ18కి చెందిన స్టాక్ విశ్లేషకుడు అభిషేక్ కొఠారి అందించిన దిగువ డేటా గమనించింది. నికర వడ్డీ ఆదాయం, నికర లాభం విషయంలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంక్ సాధించిన ప్రగతి పట్టిక ఇది.