NIFTY TRADE: 17,600 కీలకం
వీక్లీ డెరివేటివ్స్ కారణంగా నిన్న చివరి అరగంటలలో నిఫ్టి దాదాపు వంద పాయింట్లు పెరిగింది. రాత్రి వాల్‌స్ట్రీట్ చూశాక… రికవరీ మొదలైందని అనుకున్నారు. కాని వాల్‌స్ట్రీట్‌లో చివర్లో వచ్చిన అమ్మకాల ఒత్తిడితో భారీ నష్టాలతో ముగిశాయి సూచీలు. సో… ఇవాళ నిఫ్టికి 17,600 స్థాయి.. అంటే నిన్నటి కనిష్ఠ స్థాయి కీలక కానుంది. ఇవాళ్టి లెవల్స్ చూస్తే…
రెండో ప్రతిఘటన 17888
తొలి ప్రతిఘటన 17,856
నిఫ్టికి కీలక స్థాయి 17,783
తొలి మద్దతు …17658
రెండో మద్దతు.. 17626
డౌన్ బ్రేకౌట్… 17577
నిఫ్టి క్రితం ముగింపు 17,757. సింగపూర్ నిఫ్టి 150 పాయింట్ల నష్టంతోఉంది. ఇదే స్థాయిలో ప్రారంభమైతే ఓపెనింగ్‌లో నిఫ్టి రెండో మద్దతు స్థాయిని తాకనుంది. అమెరికా ఫ్యూచర్స్ ఇంకా భారీ నష్టాల్లో ఉన్నందున.. మిడ్ సెషన్ వరకు పరిస్థితిలో మార్పు ఉండకపోవచ్చు. అప్పటికీ అమెరికా తేరుకోకుంటే… నిఫ్టికి దిగువ స్థాయిలో మద్దతు అనుమానమే. ఇవాళ మార్కెట్ ముగిసిన తరవాత రిలయన్స్ ఫలితాలు ఉన్నాయి. రేపు ఐసీఐసీఐ బ్యాంక్ ఫలితాలు.