For Money

Business News

భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌

కంపెనీల ఫలితాలు మార్కెట్‌ను కుదిపేస్తున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అధికస్థాయిలో ఉండటం వల్ల అనేక కంపెనీల మార్జిన్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా క్రూడ్‌ ముడి పదార్థంగా ఉండే పెయింట్‌ కంపెనీలపై దీని ప్రభావం తీవ్రంగా పడింది. ఏషియన్‌ పెయింట్స్ నిరుత్సాహకర ఫలితాలతో పాటు బజాజ్‌ ఫైనాన్స్‌లో వచ్చిన ఒత్తిడితో నిఫ్టి 228 పాయింట్లు నష్టపోయి… ప్రస్తుతం 17,709ని తాకిన నిఫ్టి… కోలుకుంటుందా అన్నది చూడాలి. ఎందుకంటే యూరో మార్కెట్లు గ్రీన్‌లో ఉండటం ప్రధాన కారణం. అయితే వీక్లీ డెరివేటివ్స్‌ కూడా ఇవాళే ఉండటంతో … చివర్లో ఏం జరుగుతుందో చూడాలి. మరోవైపు ఆసియా మార్కెట్లో చైనా, హాంగ్‌కాంగ్‌ బంపర్‌ లాభాలతో ముగిశాయి. మార్టిగేజ్‌ రేట్లను చైనా తగ్గించడంతో హాంగ్‌ కాంగ్ మూడు శాతం పైగా లాభంతో క్లోజైంది.