చాన్నాళ్ళకు మెరిసిన బులియన్
నిన్న భారీగా పెరిగిన డాలర్ ఇవాళ కాస్త చల్లబడింది. అమెరికా మార్కెట్లో డాలర్ ఇండెక్స్ 0.2 శాతం క్షీణించి 95.52 వద్ద ట్రేడవుతోంది. అలాగే స్టాక్ మార్కెట్ కూడా గ్రీన్‌లోనే ఉన్నా… లాభాలు నామమాత్రంగా ఉన్నాయి. మూడు సూచీలూ 0.2 శాతం లాభంతో ఉన్నాయి. డాలర్ స్వల్పంగా తగ్గినా మెటల్స్‌పై దీని ప్రభావం అధికంగా ఉంది. క్రూడ్ కూడా 89 డాలర్లకు చేరువైంది. ఇక బులియన్ దూసుకుపోయింది. అమెరికా మార్కెట్లో ఔన్స్ బంగారం 1.64 శాతం పెరిగి 1,842 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అలాగే వెండి 3 శాతంపైగా పెరిగి 24.23 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక మన మార్కెట్లో అంటే ఎంసీఎక్స్‌లో పది గ్రాముల స్టాండర్డ్ బంగారం రూ. 470 పెరిగి రూ.48,396 వద్ద ట్రేడవుతోంది. ఇక కిలో వెండి రూ.1,466 పెరిగి రూ.64,485 వద్ద ట్రేడవుతోంది.