నికరలాభం 22 శాతం డౌన్
ప్రముఖ టూ వీలర్ కంపెనీ బజాజ్ ఆటో డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర పనితీరు కనబర్చింది. ఈ త్రైమాసికంలో కంపెనీ రూ. 9022 కోట్ల అమ్మకాల ఆదాయంపై రూ. 1214 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది కాలంతో పోలిస్తే నికర లాభం 22 శాతం క్షీణించింది. నిజానికి కంపెనీ టర్నోవర్ స్వల్పంగా పెరిగింది. ఎబిటా కూడా 20 శాతం క్షీణించడం విశేషం. గత కొన్ని నెలలుగా ముడిపదార్థాల వ్యయం భారీగా పెరగడంతో ఆటో ఇండస్ట్రీపై భారం పెరిగింది. ఇక చిప్ కొరత కూడా ఇంకా వేధిస్తూనే ఉంది. అయితే కంపెనీ వాహనాల్లో పలు రకాల వాహనాలు ఉండటంతో రెవెన్యూను కంపెనీ కాపాడుకోగలిగింది.గత ఏడాది త్రైమాసికంతో పోలిస్తే మార్కెట్ వాటా 18.1 శాతం నుంచి 19.2 శాతానికి పెరిగినట్లు కంపెనీ పేర్కొంది.