NIFTY TRADE: అందరూ అమ్ముతున్నారు
నిన్న అన్ని సెగ్మెంట్లలలో అమ్మకాల ఒత్తిడి వచ్చింది. విదేశీ ఇన్వెస్టర్లూ అమ్మారు. దేశీయ ఆర్థిక సంస్థలూ అమ్మాయి. క్యాష్‌లో, ఫ్యూచర్స్, ఆప్షన్స్… అన్నిటా అమ్మకాలే. ఇటువంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు మార్కెట్‌లో లాంగ్ పొజిషన్స్‌ను అవాయిడ్ చేయమని అంటున్నారు సీఎన్‌బీసీ టీవీ18 అనలిస్ట్ వీరేందర్ కుమార్. నిఫ్టి 18000 స్థాయి దిగువకు నిర్ణయాత్మకంగా వెళ్ళే వరకు షార్ట్ కూడా చేయొద్దని ఆయన అంటున్నారు. మంత్రి కాంట్రాక్ట్ తీసుకున్నవారైతే 18000 స్థాయిని గమనించాలని ఆయన అంటున్నారు. కొనుగోలు చేయొద్దు.. కాని అమ్మొద్దని అంటున్నారు. కాని డే ట్రేడింగ్‌కు మాత్రం నిఫ్టికి తొలి మద్దతు 18060 వద్ద లభించవచ్చని వీరేందర్ కుమార్ అంటున్నారు. లేదంటే 17960 వద్ద సపోర్ట్ రావొచ్చు. మార్కెట్ భారీగా పడితే మాత్రం 17910, 17877 వద్ద తదుపరి సపోర్ట్ లెవల్స్‌గా ఆయన సూచిస్తున్నారు. ఇది కేవలం ఇంట్రా డే కోసమే. ఒక వేళ నిఫ్టి గనుక క్రితం స్థాయి కంటే పెరిగితే 18157 వద్ద తొలి ప్రతిఘటన ఎదురు అవుతుందని పేర్కొన్నారు. బ్యాంక్ నిఫ్టి లెవల్స్ కోసం వీడియో చూడగలరు.
https://www.youtube.com/watch?v=A_bTb8VTtqI