నష్టాల నుంచి తేరుకున్న నిఫ్టి
ఉదయం ఓ పావు గంట గ్రీన్‌లో ఉన్న నిఫ్టి వెంటనే నష్టాల్లోకి జారుకున్న విషయం తెలిసిందే. గంటలోనే సూచీ ఇవాళ్టి కనిష్ఠస్థాయి 18,186కి క్షీణించింది. అక్కడి నుంచి క్రమంగా కోలుకుంటూ ఇవపుడు 18308కి అంటే దాదాపు క్రితం స్థాయికి వచ్చేసింది. ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంకుల షేర్లు భారీగా పెరిగాయి. ఈ ఒక్క సూచీతోనే నిఫ్టి కోలుకుంది. నిఫ్టి టాప్ 5 గెయినర్స్‌లో నాలుగు ప్రైవేట్ బ్యాంకులు ఉండటం విశేషం. బాండ్ ఈల్డ్స్ పెరుగుతున్న నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్లు గ్రీన్‌లో కొనసాగుతాయా అన్న అనుమానం వ్యక్తమౌతోంది. యూరో మార్కెట్లు గనుక నిరాశపరిస్తే నిఫ్టి మళ్ళీ నష్టాల్లోకి జారుకునే అవకాశాలున్నాయి.