యాక్సిస్ బ్యాంక్ చేతికి సిటీ బ్యాంక్ వ్యాపారం?
సిటీ బ్యాంక్ ఇండియా కన్జూమర్ బిజినెస్ కోసం కొటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ తీవ్రంగా పోటీ పడ్డాయి. యాక్సిస్ బ్యాంక్ అధిక మొత్తం ఆఫర్ చేయడంతో ఆ బ్యాంక్ ఈ బిడ్డింగ్‌లో విజయం సాధించవచ్చని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ నెలలో కొనుగోలు ఒప్పందం ఖరారయ్యే అవకాశం ఉఏంది. సిటీ ఇండియా కన్స్యూమర్ బిజినెస్ డీల్ 150 కోట్ల డాలర్లుగా ఉండే అవకాశముంది. దేశంలోని కన్జూమర్ రిటైల్ వ్యాపారం నుంచి తప్పుకోవాలని ఇప్పటికే సిటీ బ్యాంక్ ప్రకటించింది. తన వ్యాపారాన్ని అమ్మేయడానికి నిర్ణయించి బిడ్స్ ఆఫర్ చేసింది. సిటీ ఇండియాకు రిటైల్ వ్యాపారంలో 25 లక్షల మంది కస్టమర్లు, 12 లక్షల పైగా బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. డీల్‌లో నెగ్గితే యాక్సిస్ బ్యాంక్ చేతికి రూ. 28,000 కోట్ల రిటైల్ రుణాలు బిజినెస్ చేతికి వస్తుంది. అలాగే సిటీ బ్యాంక్ రూ. 9,000 కోట్ల క్రెడిట్ కార్డ్ బుక్ కూడా ఉంది. ఇది యాక్సిస్ చేతికి రానుంది.