For Money

Business News

అంచనాలను మించిన అల్ట్రాటెక్‌

సిమెంట్‌ కంపెనీలు మరోసారి అద్భుత పనితీరు కనబరుస్తున్నాయి. మూడో త్రైమాసికంలో అల్ట్రాటెక్ సిమెంట్ రూ. 1,708 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. అలాగే కంపెనీ ఆదాయం రూ. 12,985 కోట్లకు చేరింది. మార్కెట్‌ అంచనాలకు మంచి లాభం 7. 8 శాతం వృద్ధి చెందింది. అయితే ఈ త్రైమాసికంలో రూ. 535 కోట్ల వన్‌టైమ్‌ ట్యాక్స్‌ రిలీఫ్‌ వచ్చింది. ఇక కంపెనీ కన్సాలిడేటెడ్‌ అమ్మకాలు రూ.12710 కోట్లకు చేరాయి. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ. 12144 కోట్ల అమ్మకాలపై రూ.1,584 కోట్ల నికర లాభం ఆర్జించింది. మిడ్‌ సెషన్‌ వరకు అర శాతం లాభంతో ఉన్న షేర్‌ తరవాత మార్కెట్‌తోపాటు పుంజుకుంది. తరవాత 5శాతానికిపైగా పెరిగి రూ.7946ని చేరింది. కాని ముగింపు సమయానికల్లా షేర్‌ లాభం 2.74శాతానికి పరిమితమై రూ.7870.10 వద్ద ముగిసింది.