మెట్రో బ్రాండ్స్… 20 శాతం జంప్
లిస్టింగ్ రోజున ఝలక్ ఇచ్చిన మెట్రో బ్రాండ్స్ ఇవాళ 20 శాతం లాభంతో ముగిసింది. బ్రాండెడ్ ఫుట్‌వేర్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మెట్రోబ్రాండ్ గత నెలలో పబ్లిక్ ఇష్యూకు వచ్చిన విషయం తెలిసిందే. రూ. 500లకు షేర్లను ఆఫర్ చేసింది. కాని లిస్ట్ తరవాత ఒకదశలో ఈ కంపెనీ షేర్ రూ. 426కు (డిసెంబర్ 22న) పడింది. డిసెంబర్ 2021తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఆదాయం, నికర లాభం అనూహ్యంగా పెరగడంతో ఇవాళ ఈ షేర్ ఎన్ఎస్ఈలో రూ. 609.50 వద్ద ముగిసింది.ఈ ధర వద్ద లక్షకు పైగా షేర్లకు కొనుగోలుదారులు ఉన్నారు. కేవలం మూడు వారాల్లోనే ఈ షేర్ రూ. 426 నుంచి రూ. 609కి పెరిగింది. ప్రముఖ స్టాక్ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా భార్య శోభాకు ఈ కంపెనీలో వాటా ఉన్న విషయం తెలిసిందే. డిసెంబర్ 21, 2021 నాటికి మెట్రో బ్రాండ్స్‌లో రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా భార్య రేఖాకు 14.42 శాతం వాటాను కలిగి ఉంది. మూడో త్రైమాసికంలో మెట్రో బ్రాండ్స్ రూ. రూ.484 కోట్ల ఆదాయంపై రూ. 102 కోట్ల నికర లాభం ప్రకటించింది.