టెస్లాకు కేటీఆర్ ఆహ్వానం
తమ రాష్ట్రంలో టెస్లా తయారీ కేంద్రాన్ని నెలకొల్పాలని ఆ కంపెనీ అధినేత ఎలాన్ మస్క్‌కు రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆహ్వానించారు.
భారత మార్కెట్‌లోకి టెస్లా కార్లు తెచ్చేందుకు తాము ప్రయత్నిస్తున్నా… పలు సవాళ్లు ఎదురవుతున్నాయని ఎలాన్ మస్క్ మొన్న వ్యాఖ్యించారు. ఆయన ట్వీట్‌కు కేటీఆర్ స్పందించారు. తమ రాష్ట్రంలో ప్లాంట్ ఏర్పాటు ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించేందుకు టెస్లాతో కలిసి పనిచేయడానికి తాముఉ సంతోషిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా సుస్థిర నిర్ణయాలు తీసుకోవడంలో తెలంగాణ ముందుందని ఆయన ట్వీట్‌లో ప్రస్తావించారు. భారత్‌లో వ్యాపారాలకు అగ్రశ్రేణి గమ్యస్థానంగా తెలంగాణ రాష్ట్రం ఉందన్నారు. కేటీఆర్ ట్వీట్ చేసిన వెంటనే హైదరాబాద్‌లో ఉన్న పలు మల్టీనేషనల్ కంపెనీల అధికారులు కూడా మద్దతు ట్వీట్ చేస్తున్నారు.