For Money

Business News

ఇన్ఫోసిస్‌ ఫలితాలు అదుర్స్‌

డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో ఇన్ఫోసిస్‌ పనితీరు మార్కెట్‌ అంచనాలను మించింది. ఈ మూడు నెలల కాలంలో కంపెనీ రరూ. 31,867 కోట్ల ఆదాయంపై రూ. 5,809 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఆదాయం 23 శాతం పెరగ్గా, నికర లాభం 12 శాతం పెరిగింది. ఈ త్రైమాసికంలో రూ. 30,940 కోట్ల ఆదాయం, రూ. 5701 కోట్ల నికర లాభం ఆర్జిస్తుందని అంచనా వేసింది. కంపెనీ మార్జిన్‌ 23.6 శాతం నుంచి 23.5 శాతానికి తగ్గడం వినా… మిగిలిన అన్ని విభాగాల్లో కంపెనీ బాగా రాణించింది. ఇక 2022-23 ఏడాది కంపెనీ గైడెన్స్‌ను పెంచింది. ఈసారి ఆదాయం 19.5 శాతం నుంచి 20 శాతం పెరుగుతుందని అంచనా వేస్తోంది. గతంలో ఈ వృద్ధి కేవలం 16.5 శాతం నుంచి 17.5 శాతం ఉంటుందని అంచనా వేసింది. ఇన్ఫోసిస్‌ ఆదాయంలో డివిజిటల్‌ రెవన్యూ వాటా 58.5 శాతం ఉండటం విశేషం.