అరబిందో వాటా విక్రయం!
ఇంజెక్టబుల్స్ వ్యాపారంలో వాటాను విక్రయించడానికి అరబిందో ఫార్మా ప్రయత్నాలు ప్రారంభించింది. ఇటీవలే ఇంజెక్టబుల్స్ వ్యాపారాన్ని అనుబంధ సంస్థకు కంపెనీ బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఇంజెక్టబుల్స్ వ్యాపారం లో 35 శాతం వరకూ వాటా విక్రయించాలని చూస్తోంది. ఈ డీల్‌తో దాదాపు రూ.5,000 కోట్లు వస్తాయని కంపెనీ భావిస్తోంది. ఈ మేరకు ప్రైవేట్ ఈక్విటీ సంస్థల (పీఈ)తో కంపెనీ సంప్రదింపులు చేస్తున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. మొత్తం వ్యాపార విలువను రూ.15,000 కోట్లుగా లెక్కకట్టినట్లు చెబుతున్నారు. బ్లాక్‌స్టోన్ సహా అయిదారు ప్రైవేట్ ఈక్విటీ కంపెనీలు వాటా కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నాయి. వాటా కొనుగోలు సంస్థను గుర్తించి ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి కోటక్ మహీంద్రా క్యాపిటల్‌ను అరబిందో నియమించింది.