ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా టాటాలు
గడచిన 17 నెలలో చైనా కంపెనీ వివో ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ షిప్ నుంచి వైదలగింది. భారత్, చైనా మధ్య ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో 2020లో ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ షిప్ నుంచి వివో వైదొలగింది. ఇపుడు పెట్టిన పెట్టుబడిపై అంతగా ప్రతిఫలం రావడం లేదని అంటోంది. దీంతో చర్చలు జరిపిన బీసీసీఐ… వివో స్థానంలో టాటాలను తీసుకు వచ్చింది. ఒప్పొ కూడా ఇది వరకు ఐపీఎల్ స్పాన్సర్ షిప్‌ల నుంచి వైదొలగిన విషయం తెలిసిందే. ఈ రెండు కంపెనీల మాతృసంస్థ ఒకటే. 2017 నుంచి అయిదేళ్ళ పాటు టైటిల్ స్పాన్సర్ చేసినందుకు రూ. 2199 కోట్లు చెల్లించేందుకు వివో అంగీకరించింది. అంటే ఏడాదికి రూ. 440 కోట్లు అన్నమాట. ఇపుడు చివరి 2022 ఏడాది టైటిల్ స్పాన్సర్ షిప్ నుంచి వైదొలగుతోంది. ఈ స్థానంలో వచ్చిన టాటాలు ఎంత ఇస్తున్నారనేది మాత్రం ఇంకా సస్పెన్స్‌గా ఉంది.