నిఫ్టికి యూరో జోష్
ఇవాళ ఆరంభంలో నష్టాల్లోకి జారుకున్న నిఫ్టి యూరో మార్కెట్ నుంచి గట్టి మద్దతు లభించింది. వాస్తవానికి దాదాపు ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఆరంభంలో నిఫ్టి కూడా 17,964 ని తాకింది. అక్కడి నుంచి కోలుకున్న నిఫ్టి 110 పాయింట్లు పెరిగి 18,081ని తాకింది. కాని సెషన్ చివర్లో లాభాల స్వీకరణతో నిఫ్టి చాలా వరకు లాభాలను పోగొట్టుకున్న చివర్లో కోలుకుని 18055 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 52 పాయింట్లు పెరిగింది. మరోవైపు యూరో మార్కెట్లు మాత్రం అనూహ్యం ఒక శాతంపైగా లాభాలతో ట్రేడవుతోంది. యూరో స్టాక్స్ 500 సూచీ 1.25 శాతం లాభంతో ట్రేడవుతోంది. దీంతో నిఫ్టి లాభాల్లో క్లోజ్ కాగలిగింది. ఎందుకంటే ఎవరాల్గా మార్కెట్లో పెద్ద బలం లేదు. దాదాపు అన్ని సూచీలు నామమాత్రపు లాభాలతోనే ముగిశాయి. నిజానికి నిఫ్టి నెక్ట్స్ నష్టాల్లో ముగిశాయి. మిడ్ క్యాప్ సూచీ గ్రీన్‌లో ఉన్నా పెరిగింది 0.11 శాతం మాత్రమే. హెచ్‌సీఎల్ టెక్ ఇవాళ నిఫ్టిలో టాప్ గెయినర్‌గా నిలిచింది. మిడ్ క్యాప్ ఐడియా టాప్ లూజర్‌గా మిగిలింది. దాదాపు 20 శాతంపైగా ఈ షేర్ నష్టంతో ముగిసింది.