వొడాఫోన్… నో బయ్యర్స్
ఏజీఆర్ బకాయిల అంశం తెచ్చి వోడాఫోన్ కంపెనీని పూర్తిగా నిర్వీర్యం చేశాయి. ఇపుడు బకాయిలు చెల్లించలేక కంపెనీలో వాటాను అమ్మేస్తోంది వోడాఫోన్. రూ.10లకే షేర్‌ను ప్రభుత్వానికి ఆఫర్ చేస్తోంది. మార్కెట్లో నిన్న రూ.14.85 ఉన్న ఈ షేర్ ఇవాళ ఉదయం ఆరంభంలో పది శాతం లోయర్ సీలింగ్ పడింది. తరవాత సీలింగ్ ఓపెన్ చేయగా.. మరో అయిదు శాతం క్షీణించింది. ఇపుడ రూ. 12.65 వద్ద ఉంది. కాని ఈ ధర వద్ద కూడా 3.40 కోట్ల షేర్లు ఎన్ఎస్ఈలో అమ్మకానికి ఉన్నాయి. కొనేవాడు లేరు. ఇప్పటికి 21 కోట్ల షేర్లు ట్రేడవగా, కేవలం 36 శాతం షేర్లు మాత్రమే డెలివరీ తీసుకున్నారు. మరి 20 శాతం పతనం వద్ద బయ్యర్స్ వస్తారా అన్నది చూడాలి. ఎందుకంటే ప్రభుత్వానికి రూ.10 షేర్లు ఇస్తున్నారంటే… ఆ కంపెనీ షేర్ విలువ అంతే అని భావించాలి. మరి రూ.10ల దాకా వోడాఫోన్ పడుతుందా అన్నది చూడాలి. పైగా కంపెనీ నియంత్రణ ప్రభుత్వ చేతిలో ఉండగా… ఈ కంపెనీ బతుకుతుందా అన్న చర్చ కూడా మార్కెట్లో ఉంది.