For Money

Business News

రెండేళ్ళ క్రితం రూ.35.. ఇపుడు రూ.745

2019 చివర్లో లిస్టయిన కేపీఐటీ టెక్నాలజీస్‌ కంపెనీ షేర్‌ కరోనా సమయంలో తీవ్ర ఒత్తిడికి లోనైంది. టాటా మోటార్స్‌, అశోక్‌ లేల్యాండ్ షేర్లు భారీగా క్షీణించిన సమయంలో ఈ కంపెనీ షేర్‌ రూ. 35కన్నా దిగువకు చేరింది. ఇది జరిగింది 2020 మార్చిలో. ఆ తరవాత ఆటో కంపెనీలతో పాటు ఈ కంపెనీ కూడా పెరుగుతూ వచ్చింది. కారణం… ఈ కంపెనీ ప్రధాన వ్యాపారం ఆటోమొబైల్‌ కంపెనీలకు ఆటోమోటివ్‌ ఇంజినీరింగ్‌, మొబిలిటీ సొల్యూషన్స్‌ అందించడం. ఎలక్ట్రానిక్‌ వెహికల్స్‌ రాకతో ఈ కంపెనీ దశ తిరిగింది. పుణె కేంద్రంగా ఉన్న ఈ కంపెనీకి యూరప్‌, అమెరికా, జపాన్‌, చైనా, థాయ్‌ల్యాండ్‌ దేశాల్లో డెవలప్‌మెంట్‌ సెంటర్స్ ఉన్నాయి. ఆటోమొబైల్స్‌ రంగంలో ఈ కంపెనీ ఐటీ సొల్యూషన్స్‌ అందించడంలో అగ్రగామిగా ఉంది. దాదాపు 58 పేటెంట్స్‌ ఈ కంపెనీ పేరున ఉన్నాయి. అనేక రీసెర్చి బ్రోకింగ్‌ సంస్థలు ఈ కంపెనీని రెకమెండ్‌ చేస్తూ వచ్చాయి. ఇపుడు ఈ కంపెనీ షేర్‌ రూ.745 వద్ద ట్రేడవుతోంది. అనేక బ్రోకింగ్‌ సంస్థల అంచనా ప్రకారం ఈ షేర్‌ రూ. 1000లకు టార్గెట్‌ చెబుతున్నారు. గోల్డ్‌మన్‌ శాచ్స్‌ ఈ షేర్‌ టార్గెట్‌ ధరను రూ. 1040గా పేర్కొంది. అనలిస్టులు మాత్రం ప్రస్తుత ధర వొద్దని వారిస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ షేర్‌ భారీగా పెరిగిందని… కరెక్షన్‌ వచ్చినపుడు కొనుగోలు చేయాలని సిఫారసు చేస్తున్నారు.