18000పైన నిఫ్టి ముగింపు
ప్రపంచ మార్కెట్లకు భిన్నంగా మన మార్కెట్లు ముందుకు దూసుకు పోతున్నాయి. ఉదయం ఆసియా మార్కెట్లన్నీ గ్రీన్ క్లోజ్ కావడం నిఫ్టికి కలసి వచ్చింది. మిడ్సెషన్లో కాస్త తగ్గినట్లు కన్పించినా… యూరో మార్కెట్ల నష్టాలు నామమాత్రంగా ఉండటంతో నిఫ్టి మళ్ళీ 18000 స్థాయిని దాటింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 190 పాయింట్ల లాభంతో 18003 వద్ద ముగిసింది. నిఫ్టి బలానికి ప్రధాన కారణం బ్యాంక్ నిఫ్టితో పాటు టైటాన్, యూపీఎల్, హీరో హోండా, మారుతీ షేర్లను గట్టి మద్దతు అందడంతో నిఫ్టి ఎక్కడా తగ్గకుండా పెరుగుతూనే వచ్చింది. దాదాపు ఇదే స్థాయి లాభాలు మిడ్ క్యాప్ సూచీలు వచ్చాయి. బ్యాంక్ నిఫ్టి, ఎన్బీఎఫ్సీలు 1.5 శాతంపైగా లాభంతో ముగిశాయి. నిఫ్టి నెక్ట్స్ సూచీ ఒక్కటే 0.4 శాతం లాభాలకే పరిమితమైంది. ఉదయం వెలుగులో ఉన్న టీసీఎస్ తరవాత చాలా వరకు లాభాలను పోగొట్టుకుంది. ఇతర ఐటీ షేర్లలో ఒత్తిడి కన్పించింది. అయితే మిడ్ క్యాప్ ఐటీ షేర్లలో మాత్రం మంచి మూవ్మెంట్ కన్పించింది.