For Money

Business News

లాభాలతో ప్రారంభం కానున్న నిఫ్టి

శుక్రవారం అమెరికా మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ముఖ్యంగా టెక్‌ సూచీ నాస్‌డాక్‌ ఒక శాతం దాకా నష్టపోయింది. అమెరికా ఫ్యూచర్స్‌ కూడా స్వల్ప నష్టాల్లో ఉన్నాయి. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. జపాన్‌ మార్కెట్‌కు సెలవు. చైనా మార్కెట్‌ గ్రీన్‌లోఉంది. కాని ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్‌ నష్టాల్లో ఉన్నాయి. ఇక చాలా రోజుల తరవాత హాంగ్‌సెంగ్‌ 0.9 శాతం లాభంతో ట్రేడవుతోంది. సింగపూర్ నిఫ్టి 75 పాయింట్ల లాభంతోఉంది. నిఫ్టి కూడా గ్రీన్‌లో ప్రారంభం కానుంది.