వొకార్డ్ రైట్స్ ఇష్యూకు ఓకే
ప్రముఖ ఫార్మా కంపెఈ వొకార్డ్.. రైట్స్ ఇష్యూ ద్వారా రూ.1,000 కోట్ల నిధుల్ని సమీకరించాలని నిర్ణయించింది. కంపెనీ ఆర్థిక అవసరాలు, రుణ బకాయిల చెల్లింపులు, పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాల కోసం ఈ నిదులను వినియోగించనున్నట్లు కంపెనీ ఎక్స్ఛేంజీలకు సమాచారమిచ్చింది. రైట్స్ ద్వారా రూ.1,000 కోట్లకు మించకుండా నిధుల్ని సమీకరించే ప్రతిపాదనను గురువారం నిర్వహించిన డైరెక్టర్ల బోర్డు సమావేశం ఆమోదించింది. రైట్స్ ఎన్టైటిల్మెంట్ నిష్పత్తి, ఇష్యూ ధర, రికార్డు తేదీ, ఇష్యూ సమయం, ఇతర విషయాలను క్యాపిటల్ రైజింగ్ కమిటీ నిర్ణయిస్తుందని తెలిపింది.