For Money

Business News

అరబిందో ఫార్మా నుంచి మోల్నుపిరవిర్‌

డాక్టర్‌ రెడ్డీస్‌ తరవాత మోల్నుపిరవిర్‌ క్యాప్సుల్స్‌ను హైదరాబాద్‌ ఫార్మా కంపెనీలైన అరబిందో ఫార్మా, ఎంఎస్‌ఎన్‌ ల్యాబ్స్‌ మన మార్కెట్‌ విడుదల చేశాయి. అరబిందో ఫార్మా ‘మోల్నాఫ్లూ’ బ్రాండు పేరుతో, ఎంఎస్‌ఎన్‌ ల్యాబ్స్‌ ‘మోలులో’ పేరుతో ఈ క్యాప్సుల్స్‌ను విక్రయిస్తాయి. ఈ ఔషధాన్ని కొవిడ్‌-19 చికిత్సలో వినియోగించడానికి ఇటీవల మనదేశంలో అత్యవసర అనుమతి లభించిన విషయం విదితమే.