HYD: హౌసింగ్ సేల్స్ 142% జూమ్
ఇళ్ళ అమ్మకాలలో హైదరాబాద్ మార్కెట్ జెట్ స్పీడ్‌తో ముందుకు సాగుతోంది. మెట్రో నగరాలను వెనక్కి నెట్టేస్తోంది. దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో ఇళ్ళ అమ్మకాలు జోరుగా ఉన్నాయి. గత ఏడాది హైదరాబాద్ మార్కెట్లో మొత్తం 24,312 ఇళ్లు అమ్మారు. 2020తో పోలిస్తే ఇది 142 శాతం అధికంగా. ధరల్లో 7 శాతం వరకు వృద్ధి కనిపించిందని స్థిరాస్తి సేవల సంస్థ నైట్‌ఫ్రాంక్ నివేదికలో వెల్లడించింది. 2021 జులై-డిసెంబరు మధ్య 12,344 ఇళ్ల విక్రయాలు జరిగాయి. 2020 ఇదే సమయంతో పోలిస్తే ఇందులో 135% వృద్ధి కనిపించింది. ఏడాది మొత్తంలో కొత్త ఇళ్ల నిర్మాణం 179 శాతం పెరిగి, 35,736గా నమోదైనట్లు నైట్ ఫ్రాంక్ పేర్కొంది. పశ్చిమ హైదరాబాద్ వైపున్న కోకాపేట్, పటాన్చెరు, గోపన్నపల్లి, నల్లగండ్లలో స్థిరాస్తి అభివృద్ధి ఎక్కువగా కనిపిస్తోంది.