17900పైన ముగిసిన నిఫ్టి
యూరో మార్కెట్లు ఒక మోస్తరు లాభాల్లో ఉండటంతో పాటు అమెరికా ఫ్యూచర్స్ గ్రీన్‌లో ఉండటంతో… నిఫ్టి తన మిడ్ సెషన్ జోరును కొనసాగించింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 120 పాయింట్ల లాభంతో 17,925 పాయింట్ల వద్ద ముగిసింది. ఉదయం ఆరంభంలో నష్టాల్లోకి జారుకుని 17,748ని తాకిన నిఫ్టి అక్కడి నుంచికోలుకుని 17944 దాకా పెరిగింది. ఉదయం టెక్నికల్స్ అనలిస్టులు చెప్పినట్లు నిఫ్టికి 17440 కీలక మద్దతు స్థాయిగా మారింది. 17850 బ్రేకౌట్ తరవాత వెనక్కి తిరిగి చూడలేదు. ఇవాళ కూడా బ్యాంక్ నిఫ్టి, ఎన్బీఎఫ్సీ షేర్లే నిఫ్టికి అండగా నిలిచాయి. ఒకవిధంగా చెప్పాలంటే నిఫ్టిని పెంచేందుకు కావాలని కేవలం కొన్నిరంగాల షేర్లను పెంచారు.దీంతో నిఫ్టి పెరిగిందే కాని… మిడ్ క్యాప్ సూచీ పెరగలేదు. దాదాపు క్రితం స్థాయి వద్దే ఉంది. నిఫ్టి నెక్ట్స్‌కు కూడా స్వల్ప మద్దతు అందింది. టాప్ గెయినర్స్‌లో మూడు బ్యాంక్.ఎన్బీఎఫ్సీ షేర్లు ఉండగా, నష్టాల్లో ఉన్న టాప్ ఫైవ్ షేర్లు ఐటీ రంగానికి చెందినవి.