MID SESSION: సూచీలు పైకి… షేర్లు దిగువకు
కేవలం నిఫ్టిలో ఉన్న షేర్లలోనే డ్రామా నడుస్తోంది. ముఖ్యంగా సూచీల్లో ఉన్న బ్యాంకు షేర్లు, ఎన్బీఎఫ్సీ షేర్లతో నిఫ్టిని మేనేజ్ చేస్తున్నారు. నిఫ్టి 18000 టార్గెట్ విదేశీ ఇన్వెస్టర్లు కాల్ ఆప్షన్స్ కాంట్రాక్ట్‌ను భారీగా అమ్మారు. అలాగే క్యాష్‌లో కూడా కొంటున్నారు. వీక్లీ డెరివేటివ్స్ లోగా సూచీ 18000 దగ్గరకు వెళ్ళుతుందని టెన్నికల్ అనలిస్టులు అంటున్నారు. ఇవాళ నిఫ్టి రెండు, మూడు సార్లు నష్టాల్లోకి వెళ్ళినా… కోలుకుని దాదాపు వందకు పైగా పాయింట్ల లాభంతో 11,919 వద్ద ట్రేడవుతోంది. అంతకుముందు నిఫ్టి 17,927ని కూడా తాకింది. మరి విదేశీ ఇన్వెస్టర్ల అంచనాలను నిఫ్టి తాకిందా లేదా రేపు చేరిందా అన్నది చూడాలి. యూరో మార్కెట్లు బలహీనంగా ఉండటం, అమెరికా ఫ్యూచర్స్ డల్‌గా ఉండటంతో నిఫ్టిలో చివర్లో ఏమైనా ఒత్తిడి వస్తుందేమో చూడాలి. చిన్న ఇన్వెస్టర్లు మార్కెట్‌కు దూరంగా ఉండటం బెటర్.