For Money

Business News

డాలీ ఖన్నా కొన్నారు… ఇన్వెస్టర్లు ఎగబడుతున్నారు

ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్‌ డాలీ ఖన్నా తాజాగా కొనుగోలు చేసిన టిన్నా రబ్బర్ అండ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ అనే స్పెషాల్టీ కెమికల్ కంపెనీ రికార్డు లాభాలు సాధించింది. మూడో త్రైమాసికంలో ఈ షేర్‌ను ఈమె కొనుగోలు చేసినట్లు మింట్‌ పత్రిక వెల్లడించింది. మొత్తం 1,42,739 షేర్లు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇది కంపెనీ మొత్తం వాటాలో 1.7శాతం. ఈ విషయం మీడియాలో వచ్చిన తరవాత ఈ షేర్‌ కోసం ఇన్వెస్టర్లు ఎగబడుతున్నారు. ఇవాళ మూడో రోజు కూడా ఈ షేర్‌ అప్పర్‌ సీలింగ్‌ను తాకింది. నిన్న .192.55 వద్ద ముగిసిన ఈ షేర్‌ ఇవాళ రూ.202.15 వద్ద అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. గత 24 నెలల్లో ఈ షేర్‌ 500శాతం పెరగ్గా, గత నెలరోజుల్లోనే 50శాతం పెరిగింది. హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఉన్న టిన్నా రబ్బర్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వేస్ట్ టైర్లనుంచి డౌన్ లైన్ ప్రొడక్ట్స్‌ని తయారు చేసే వ్యాపారంలో ఉంది. ఎమల్షన్ , రబ్బర్ బూట్లు, రబ్బర్ తొడుగులు, రిక్లైమ్ రబ్బర్, మెటల్ షాట్స్, స్టీల్ గ్రిట్స్ , వైర్ ఉత్పత్తులను తయారు చేస్తుంది.