For Money

Business News

హెచ్‌పీ అడెసివ్స్…రోజూ అప్పర్‌ సీలింగ్‌

గత ఏడాది చివర్లో వచ్చిన పబ్లిక్‌ ఆఫర్స్‌లలో హెచ్‌పీ అడెసివ్స్ రికార్డు సృష్టిస్తోంది. లిస్టింగ్‌ రోజు నుంచి వరుసగా ఆరు రోజులుగా అప్పర్ సర్క్యూట్‌ను తాకుతోంది ఈ షేర్‌. నిన్న కూడా బీఎస్ఈలో ఈ కంపెనీ షేర్లు 5 శాతం పెరిగి రూ.448.70కి చేరాయి. అడెసివ్స్ అండ్ సీలాంట్స్ రంగానికి చెందిన ఈ కంపెనీ గత వారం మార్కెట్‌లో లిస్టయిన విషయం తెలిసిందే. తొలి రోజున ఇష్యూ ధర రూ. 274 కంటే 22 శాతం అధిక ప్రీమియంతో స్టాక్ ముగిసింది. నిన్నటి లాభాన్ని పరిగణనలో తీసుకుంటే ఈ షేర్‌ ఇష్యూ ధర కంటే 64 శాతం పెరిగిందన్నమాట.
హెచ్‌పీ అడెసివ్స్ ఈక్విటీ షేర్లలో ట్రేడింగ్‌ను ఈ నెల 10 నుంచి ట్రేడ్ ఫర్ ట్రేడ్ సెగ్మెంట్ (T గ్రూప్) నుంచి రోలింగ్ విభాగానికి బదిలీ అవుతుంది. కంపెనీకి చెందిన ఈక్విటీ షేర్లలోని లావాదేవీలు B గ్రూప్‌లో జరుగుతాయి. హెచ్‌పీ అడెసివ్స్ ఇతర అనుబంధ ఉత్పత్తులతో పాటు అడెసివ్స్, సీలాంట్‌ల తయారీ, పంపిణీలో నిమగ్నమై ఉంది. ఈ రంగంలో చాలా తక్కువ కంపెనీలు ఉండటం, ఈ కంపెనీ ఆర్థిక పనితీరు భేషుగ్గా ఉండటంతో ఇన్వెస్టర్లు ఈ షేర్‌ కోసం పరుగులు పెడుతున్నారు.