For Money

Business News

NIFTY TODAY: పెరిగితే అమ్మండి

నిఫ్టి ఇపుడు ఓవర్‌బాట్ పొజిషన్‌లోకి వచ్చింది. టెక్నికల్‌ సంకేతాలు బై సిగ్నల్స్‌ ఇస్తున్నా… నిఫ్టిలో భారీ కొనుగోళ్ళు, రేపు డెరివేటివ్‌ క్లోజింగ్ కారణంగా నిఫ్టిలో ఒత్తిడి వచ్చే అవకాశముంది. నిఫ్టి క్రితం ముగింపు 17,233 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టి ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. నిఫ్టికి దిగువ స్థాయిలో17190 లేదా 17170 వద్ద మద్దతు అందే అవకాశముంది. 17150 దిగువకు వస్తే మాత్రం కొనుగోలు చేయొద్దని అనలిస్టులు అంటున్నారు. ఎందుకంటే ఆ స్థాయి దిగువకు వస్తే 17120 లేదా 17050కి వెళ్ళే అవకాశముంది. ఒకవేళ దిగువ స్థాయిలో మద్దతు అందే పక్షంలో 17190కి చేరనుంది. ఒకవేళ క్రితం ముగింపును దాటి లాభాల్లోకి వస్తే మాత్రం 17250, 17290 దాకా వెళ్ళే అవకాశముంది. ఒకవేళ ఆరంభంలో నిఫ్టి గనుక గ్రీన్‌లోకి వస్తే మాత్రం అమ్మడానికి గోల్డన్‌ ఛాన్స్‌గా భావించవచ్చు.