For Money

Business News

కుప్పకూలిన ఆర్‌బీఎల్‌ బ్యాంక్

కంపెనీ సీఈఓను ఆర్‌బీఐ సెలవుపై పంపేయడంతో ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ షేర్‌పై తీవ్ర ఒత్తిడి వస్తోంది. ఈ బ్యాంక్‌లో కొందరు ఇన్వెస్టర్లు పెట్టుబడి పెడతారని వార్తలు రావడం,దాన్ని వారు ఖండిచండంతో ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడి పెరిగింది. ఈ బ్యాంక్‌ భారీ ఎత్తున ఎన్‌పీఏలను దాచిందన్న వార్తలు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ బ్యాంక్‌ కొనసాగుతుందా లేదా మరో బ్యాంక్‌లో విలీనం చేస్తారా అన్న చర్చ మొదలైంది.దీంతో ఈ షేర్‌ ఇవాళ పది శాతం లోయర్‌ సీలింగ్‌తో ప్రారంభమైంది. అయినా కొనుగోలుదారులు ముందుకు రాలేదు. లోయర్‌ సీలింగ్‌ గడువు 15 నిమిషాల తరవాత మళ్ళీ ఈ కౌంటర్‌ ప్రారంభంగా కాగానే మరో 5 శాతం క్షీణించింది. ఒకే రోజు రూ. 172.90 నుంచి రూ. 147కు పడింది. చిత్రమేమిటంటే ఈ ధర వద్ద కోటి 34 లక్షల షేర్లు అమ్మకానికి రెడీగా ఉన్నాయి. చూస్తుంటే మరో అయిదు శాతం పడటం ఖాయంగా కన్పిస్తోంది.