NIFTY TODAY: 17,050 లక్ష్మణ రేఖ
ఇవాళ మన మార్కెట్లలో వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్. అమెరికా మార్కెట్‌ను ట్రాక్ చేస్తున్న నిఫ్టి ఇవాళ ఓపెనింగ్‌లోనే 17000 పాయింట్ల స్థాయిని దాటే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఆసియా మార్కెట్లు నామమాత్రపు లాభాలతో ట్రేడవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ్టి ట్రేడింగ్‌ను పరిశీలిస్తే… నిఫ్టి క్రితం ముగింపు 16,955. నిఫ్టి గనుక ఓపెనింగ్‌లోనే 17000 స్థాయిని దాటితే కాస్సేపు ఆగండి 17025 దాటితే అమ్మండి. రిస్క్ తీసుకునే వారు అంతకన్నా ముందే అమ్మొచ్చు. కాని స్టాప్‌లాస్ 17,040-17,050. ఈ స్థాయి దాటితే నిఫ్టిలో కొనుగోళ్ళు ఆసక్తి వస్తుంది. కాబట్టి దీనిపై షార్ట్ చేయొద్దు. నిఫ్టికి 17030 ప్రాంతంలో అమ్మకాల ఒత్తిడి వస్తే వెంటనే మద్దతు 16,890 వద్ద వస్తుంది, కాదంటే 16,880. నిఫ్టికి దిగువ స్థాయిలో మద్దతు ఉన్నా ఆల్గో లెవల్‌స్ చూస్తే నిఫ్టి 16,830ని తాకొచ్చు. దిగువకు వెళితే భారీ ఒత్తిడి రావొచ్చు. కాని ఇవాళ ఆ పరిస్థితి రాకపోవచ్చు. ఎందుకంటే నిఫ్టి 16850పైనే మద్దతు లభించే అవకాశముంది. స్వల్పకాలానికి నిఫ్టి బై సిగ్నల్ ఇస్తున్నా..దీర్ఘకాలిక సూచీలు సెల్ సిగ్నల్ ఇస్తున్నాయి. ఇవాళ నిఫ్టి ఆల్గో లెవల్స్‌కు పరిమితం కావొచ్చు.