సోనీ- జీ డీల్ వివరాలు ఇవే…
సోనీ పిక్చర్స్‌తో విలీనం అవడానికి జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఇవాళ సమావేశమై… రెండు కంపెనీల మధ్య బైండింగ్ అగ్రిమెంట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఒప్పందం ప్రకరాం ఇపుడున్న ఇన్వెస్టర్లకు రైట్స్ ఇష్యూ ద్వారా 26.5 కోట్ల షేర్లను జారీ చేయనుంది. దీని ద్వారా రూ. 7,948 కోట్లను సమీకరించాలని భావిస్తోంది. ఎస్‌ఎల్ హోల్డింగ్స్‌కు రూ.1,101 కోట్ల విలువైన 3.7 కోట్ల షేర్లను జీ ఎంటర్‌టైన్‌మెంట్ జారీ చేయనుంది. జీ ఎంటర్‌టైన్మెంట్‌కు చెందిన ప్రతి 100 షేర్లకు సోనీకి 85 షేర్లను జీ కేటాయించనుంది. అలాగే బంగ్లా ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందినప్రతి 10 షేర్లకు గాను 133 షేర్లను సోనీ పిక్చర్స్‌కు జారీ చేస్తారు. విలీన సంస్థకు జీ కంపెనీ ప్రమోటర్ అయిన పునీత్ గోయెంక మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓగా వ్యవహరిస్తారు.విలీన కంపెనీలో సోనీ తరఫున మెజారిటీ సంఖ్యలో డైరెక్టర్లు ఉండేందుకు జీ అంగీకరించింది.