For Money

Business News

లాటరీ పద్ధతిలోనే H1 B వీపాలు

హెచ్‌వన్‌ బీ వీసాల ఎంపిక ప్రక్రియ పద్ధతిని మార్చాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు అమెరికా తెలిపింది. యూఎస్‌ సిటీజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. తుది ఉత్తర్వులను ఇవాళ వెల్లడించనుంది. సాధారణంగా హెచ్‌వన్‌ బీ వీసాలను లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తారు. ఈ పద్ధతిని మార్చాలని గత జనవరిలో అమెరికా కొత్త నిబంధనలను తెచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకున్నట్లు తాజాగా అమెరికా పేర్కొంది. అమెరికా కొత్త పద్ధతిని కాలిఫోర్నియా కోర్టు ఇదివరకే కొట్టేసిన విషయం తెలిసిందే.