జీ-సోనీ డీల్ ఓకే…నేడే ఒప్పందం?
జీ ఎంటర్టైన్మెంట్, సోనీ పిక్చర్స్ మధ్య ఇవాళ విలీన ఒప్పందం కుదరనుంది. రెండు కంపెనీల మధ్య తుది చర్చలు కూడా పూర్తయ్యాయని, ఇవాళ ఉదయం రెండు కంపెనీల మధ్య డీల్ కుదిరే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. మార్కెట్ ప్రారంభానికి ముందే తుది విలీన ఒప్పందం వివరాలు మార్కెట్కు తెలిసే అవకాశముంది. ఈ విలీనం కుదిరే పక్షంలో దేశంలో రెండో అతిపెద్ద మీడియా గ్రూప్ అవతరిస్తుంది. కొత్త ఏర్పాటు అయ్యే కంపెనీ చేతికి 75 టీవీ ఛానల్స్, రెండు వీడియో స్ట్రీమింగ్ (జీ 8, సోనీ లివ్)తో పాటు రెండు ఫిలిమ్ స్టూడియోలు, ఒక డిజిటల్ కంటెంట్ స్టూడియోతోపాటు అనేక ప్రొగ్రామ్ల లైబ్రరీ వస్తాయి. ఈ విలీనానికి 75 శాతం మంది వాటాదారుల అనుమతి తప్పనిసరి. జీలో కీలక వాటాదారు అయిన ఇన్వెస్కోకు 17.88 శాతం వాటా ఉంది. జీ గ్రూప్ ప్రమోటర్లకు విలీనం తరవాత ఏర్పడే కొత్త కంపెనీలో 3.99 శాతం వాటా ఇవ్వడాన్ని ఇన్వెస్కో వ్యతిరేకిస్తోంది. ప్రస్తుతం జీ ప్రమోటర్లకు కంపెనీలో కేవలం 2 శాతం వాటా మాత్రమే ఉంది.