For Money

Business News

మార్చిలోగా ఎల్‌ఐసీ IPO కష్టం

ప్రభుత్వ రంగ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఎల్‌ఐసీ ఐపీఓ మార్చిలోగా వచ్చే సూచనలు కనిపించడం లేదు. సంస్థ విలువను అంచనా వేయడం ఆలస్యమవుతోందని.. ఈ నేపథ్యంలో ఐపీఓ ఈ ఏడాది సాధ్యం కాకపోవచ్చునని అధికార వర్గాలు అంటున్నారు. సంస్థ పరిమాణం, అందిస్తున్న పాలసీలు, స్థిరాస్తులు, అనుబంధ సంస్థల వంటి కారణంగా ఎల్‌ఐసీ విలువను అంచనా వేయడం సంక్లిష్టంగా మారినట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయితే తప్ప విక్రయించాల్సిన షేర్ల సంఖ్యను ప్రభుత్వం నిర్ణయించలేదు. ఇది పూర్తయిన తరవాత మార్కెట్‌ నియంత్రణా సంస్థ సెబీ, బీమా నియంత్రణా సంస్థ ఐఆర్‌డీఏఐల నుంచి కూడా అనుమతులు తీసుకోవడానికి కొంత సమయం పడుతుంది. వీటన్నింటి దృష్ట్యా మార్చిలోగా ఎల్‌ఐసీ ఐపీఓ కష్టమే.