For Money

Business News

ఇవాళ డౌజోన్స్‌ వంతు

ఉద్దీపనకు త్వరలోనే బ్రేక్‌ వేసి, వడ్డీ రేట్లను కూడా తొందరగా పెంచుతామని చెప్పిన ఫెడరల్‌ రిజర్వ్‌ నిర్ణయానికి టెక్‌ కంపెనీలు బాగా స్పందించాయి. నిన్న నాస్‌డాక్‌ భారీగా క్షీణిస్తే.. ఇవాళ డౌజోన్స్‌ వంతు. డౌజోన్స్‌ ఇవాళ 1.3 శాతం నష్టపోయింది. నాస్‌డాక్‌ కూడా 0.4 శాతం నష్టంతో ట్రేడవుతోంది. నిన్న ఇవాళ కూడా ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ ఒక శాతం వరకు నష్టపోయింది. డాలర్‌ బలపడే కొద్దీ మార్కెట్‌ పడుతోంది. డాలర్‌ ఇండెక్స్‌ ఇవాళ మరో 0.4 శాతం పెరిగింది. అందుకే క్రూడ్‌ భారీగా క్షీణించింది. బ్రెంట్‌ క్రూడ్‌ రెండు శాతం తగ్గి 74 డాలర్ల దిగువకు వచ్చేసింది. ఇక ఇవాళ బులియన్‌ స్థిరంగా ఉంది.