20 నెలల కనిష్ఠానికి రూపాయి
విదేశీ మారక ద్రవ్య మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ ఇవాళ భారీగా తగ్గింది. నిన్నటితో పోలిస్తే ఇవాళ 44 పైసలు నష్టపోయి రూ.76.32 వద్ద ముగిసింది. గత ఏడాది ఏప్రిల్ 24 తర్వాత డాలర్‌తో రూపాయి మారకం రేటు ఈ స్థాయికి పడిపోవడం ఇదే మొదటిసారి. ఎఫ్‌పీఐల అమ్మకాల హోరు, ఫెడ్ సమావేశం నేపథ్యంలో ట్రేడర్లు రిస్కు తీసుకునేందుకు ఇష్టపడక పోవడం ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఫెడ్ రిజర్వు వడ్డీ రేట్లు పెంచితే డాలర్‌తో రూపాయి మారకం రేటు త్వరలోనే రూ.76.60కి కూడా పతనమయ్యే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. ఏడాది చివరిలోగా 77కు పడుతుందని అంచనా వేస్తున్నారు.