వాల్‌స్ట్రీట్: నాస్‌డాక్ మళ్ళీ డౌన్
మార్చిలోగా బాండ్ కొనుగోళ్ళను పూర్తి చేస్తానని ఫెడరల్ చెప్పడంతో భారీగా క్షీణించిన ఐటీ షేర్ల ముచ్చట ఒక్కరోజు ముచ్చటగా మిగిలిపోయింది. ఆరంభ లాభాలన్నీ కొద్ది సేపటిలోనే ఆవిరి అయిపోయాయి. నాస్‌డాక్ మళ్ళీ 1.3 శాతం వరకు నష్టపోయింది. ఎస్ అండ్ పీ 500 సూచీ దాదాపు స్థిరంగా ఉండే ప్రయత్నం చేస్తోంది. ఇక డౌజోన్స్ మాత్రం 0.37 శాతం లాభంతో ట్రేడవుతోంది. అడోబ్ ఇవాళ 8 శాతంపైగా పడింది. డాలర్ అర శవాతం దాకా నష్టపోయినా.. మార్కెట్‌పై దాని ప్రభావం పెద్దగా లేదు. కాని క్లోజింగ్ వరకు మార్కెట్ ఎలా ఉంటుందో చూడాలి. మరోవైపు డాలర్ పతనంతో కమాడిటీస్ చెలరేగిపోతున్నాయి. వెండి నాలుగు శాతంపైగా, బంగారం రెండు శాతం దాకా లాభపడ్డాయి. WTI క్రూడ్ రెండు శాతంపైగా లాభపడగా, బ్రెంట్ క్రూడ్ 1.5 శాతం లాభంతో ఉంది. బ్రెంట్ మళ్ళీ 75 డాలర్లు దాటింది.