NIFTY TRADE: అమ్మకాలు ఆగేనా?
విదేశీ ఇన్వెస్టర్ల వరుస అమ్మకాలకు ఇవాళ ఫుల్ స్టాప్ పాడుతుందా అన్నది చూడాలి. గడచిన రెండు వారాల నుంచి ప్రతి రోజూ విదేశీ ఇన్వెస్టర్లు అమ్ముతూనే వస్తున్నారు. ఆసియా మార్కెట్లలో చైనా, హాంగ్కాంగ్ మార్కెట్లు భారీగా క్షీణించడంతో విదేశీ ఇన్వెస్టర్లకు అక్కడి మార్కెట్లు ఆకర్షణీయంగా కన్పిస్తున్నాయి. ఇపుడు ఫెడ్ నిర్ణయం కూడా రావడంతో అమ్మకాల ఒత్తిడి ఆగుతుందా? కొనసాగుతందా? అన్నది చూడాలి. నిఫ్టికి తొలి ప్రతిఘటన 17334 వద్ద, తరవాతి ప్రతిఘటన 17404 వద్ద ఎదురవుతుందని వీరేందర్ కుమార్ అంటున్నారు. ఈ రెండు స్థాయిలను దాటితే తదుపరతి ఒత్తిడి 17466, 17493 రానుంది. ఇక పడితే తొలి మద్దతు 17159, 17107 వద్ద లభించవచ్చు. ఇతర లెవల్స్ కోసం వీడియో చూడండి.
https://www.youtube.com/watch?v=KaP9syezQ2E