ఉద్దీపన కోత డబుల్
కరోనా సమయంలో ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీని చాలా తొందరగా ముగించాలని
అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ నిర్ణయించింది. జనవరి నుంచి ప్రతి నెల 1500 కోట్ల డాలర్ల విలువైన బాండ్లను కొనుగోలు చేయాలని ఇది వరకు ప్రకటించింది. దీనికి బదులు జనవరి నుంచి 3000 కోట్ల డాలర్ల విలువైన బాండ్లను కొనాలని నిర్ణయించింది. అలాగే వడ్డీ రేట్లను షెడ్యూల్ కంటే ముందే పెంచనున్నట్లు ప్రకటించింది. వచ్చే ఏడాది మొత్తం మూడుసార్లు వడ్డీ రేట్లు పెంచనుంది. తొలి పెంపు వచ్చే ఏడాది రెండో త్రైమాసికంలో ప్రకటించే అవకాశముంది. దేశంలో ద్రవ్యోల్బణం పెరిగి పోతున్నందున ఫెడ్ ఈ నిర్ణయాలు తీసుకుంది. దేశ జీడీపీ ఇది వరకు ప్రకటించినట్లు 5.9 శాతం కాకుండా 5.5 శాతం మాత్రమే ఉంటుందని పేర్కొంది.