స్థిరంగా ప్రారంభమైన నిఫ్టి
సింగపూర్ నిఫ్టి ఇచ్చిన సంకేతాల మేరకు నిఫ్టి స్థిరంగా ప్రాంభమైంది. సూచీల్లో పెద్ద మార్పు లేదు. ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి వస్తోంది. చక్కెర రంగానికి భారత్ ఇస్తున్న సబ్సిడీలపై WTOఅభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై భారత్ అప్పీల్ చేసే అవకాశముంది. ఈ రంగానికి చెందిన షేర్లపై ఒత్తిడి వస్తోంది. మిడ్ క్యాప్ షేర్లు కూడా స్థిరంగా ఉన్నాయి. సూచీల్లో పెద్ద మార్పు లేదు. నిఫ్టి 17,309ని తాకిన తరవాత 17,333 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే 9 పాయింట్ల లాభంతో ఉంది. నిఫ్టిలో 26 షేర్లు నష్టాల్లో ఉన్నాయి.