డాలర్ గ్రీన్… వాల్‌స్ట్రీట్ రెడ్
నిరుద్యోగుల డేటా అంచనాలను తప్పడంతో కరెన్సీ మార్కెట్లో డాలర్ పెరిగింది. డాలర్ ఇండెక్స్ 0.45 శాతం పెరిగి 96.32 వద్ద ట్రేడవుతోంది. వాల్‌స్ట్రీట్‌లో మళ్ళీ నాస్‌డాక్‌పై ఒత్తిడి అధికంగా ఉంది. 0.7 శాతం నష్టంతో ఉంది. ఎస్ అండ్ పీ 500 మాత్రం 0.35 శాతం నష్టంతో ఉండగా, డౌజోన్స్ క్రితం ముగింపు వద్దే ఉంది. డాలర్ పెరగడంతో క్రూడ్ ఆయిల్ నష్టాల్లో ఉంది. కాని డాలర్ నష్టంతో పోలిస్తే మాత్రం క్రూడ్ పతనం కేవలం నామమాత్రమే అని చెప్పొచ్చు. బులియన్ రెడ్‌లో ఉన్నా బంగారంలో మార్పు లేదు. వెండి మాత్రం ఒకటిన్నర శాతం తగ్గింది.