డిజిటల్ కరెన్సీ వచ్చే ఏడాదే!
సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని (సీబీడీసీ) ప్రారంభించడానికి సన్నాహాలు ప్రారంభించామని వచ్చే ఏడాదిలో ప్రయోగాత్మకంగా అధికారిక డిజిటల్ కరెన్సీని తెచ్చేందుకు ప్రయత్నిస్తామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. డిజిటల్ మోసాలకు తావులేకుండా, పటిష్ఠమైన వ్యవస్థతో దీన్ని తేవాలని భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. డిజిటల్ లావాదేవీలపై వేస్తున్న ఛార్జీలపై త్వరలోనే ఒక చర్చా పత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఆయన చెప్పారు.
ఇప్పటివరకు స్మార్ట్ ఫోన్లతోనే యూపీఐ చెల్లింపులు చేయగలుగుతున్నాం. ఇకపై ఫీచర్ ఫోన్లతోనూ డిజిటల్ చెల్లింపులు జరిపేలా యూపీఐ ఆధారిత చెల్లింపు పద్ధతులను ఆవిష్కరించేందుకు కృషి చేస్తున్నామని శక్తికాంత దాస్ అన్నారు.