రేట్ గెయిన్ ఐపీఓ నేటి నుంచే.. దరఖాస్తు చేయొచ్చా?
రేట్ గెయిన్ ట్రావెల్ టక్నాలజీస్ కంపెనీ పబ్లిక్ ఆఫర్ ఇవాళ ప్రారంభమైంది. మార్కెట్ నుంచి రూ. 1,335 కోట్లు సమీకరించేందుకు కంపెనీ షేర్లను జారీ చేస్తోంది. షేర్ ధర శ్రేణి రూ. 405 నుంచి రూ. 425గా కంపెనీ నిర్ణయించింది. పబ్లిక్ ఇష్యూకు కనీసం 35 షేరర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అంటే దరఖాస్తు సొమ్ము కింద రూ. 14,175 చెల్లించాల్సి ఉంటుంది. ట్రావెల్, హాస్పిటల్ సర్వీసెస్ రంగాలకు సాఫ్ట్వేర్ సర్వీస్‌ను అందించే సంస్థ ఇది. ఇష్యూ ఈనెల 17న లిస్ట్ అయ్యే అవకాశముంది. ఇపుడు ఈ షేర్‌కు గ్రేమార్కెట్లో రూ.85 లభిస్తోంది. మరి లిస్టింగ్ రోజు వరకు ఈ ప్రిమియం ఉంటుందా అన్నది చూడాలి. ఎందుకంటే చాలా మంది టెక్నికల్ అనలిస్టులు ఈ ఇష్యూ ద్వారా దీర్ఘకాలిక లాభాలు ఉంటాయని, వెంటనే లాభాలు ఉండకపోవచ్చని అంటున్నారు. మార్కెట్ కోలుకుంటే పరవాలేదు. లేకుంటే లిస్ట్ రోజున ఆకర్షణీయ ప్రిమియం అనుమానమే.