For Money

Business News

10న మెట్రో బ్రాండ్స్‌ ఐపీఓ

ప్రముఖ ఫుట్‌వేర్‌ రిటైలర్‌ ‘మెట్రో బ్రాండ్స్‌ లిమిటెడ్‌’ పబ్లిక్‌ ఆఫర్‌ ఈనెల 10న ప్రారంభం కానుంది. 14న ముగియనుంది. షేర్‌ ముఖవిలువ రూ. 5. రూ.295 కోట్లు విలువ చేసే తాజా షేర్లను జారీ చేయడంతో పాటు 2.14 కోట్ల ఈక్విటీ షేర్లను ఈ ఇష్యూ ద్వారా ఆఫర్‌ చేయనున్నారు. విక్రయించనున్నారు. ఈ ఐపీఓ ద్వారా ప్రమోటర్లు కూడా 10 శాతం వాటాను అమ్ముతున్నారు. పబ్లిక్ ఆఫర్‌ తరవాత కంపెనీలో ప్రమోటర్ల వాటా 75 శాతానికి తగ్గనుంది. 2007 నుంచి ఈ సంస్థలో ప్రముఖ స్టాక్‌ బ్రోకర్‌ రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా ఇన్వెస్ట్‌ చేస్తూ వచ్చారు. ఈ పబ్లిక్‌ ఇష్యూలో సమీకరించే నిధులతో తమ సొంత బ్రాండ్లయిన మెట్రో, మోచి, వాక్‌వే, డ విన్సి బ్రాండ్లను కంపెనీ విస్తరించనుంది.. ఈ కంపెనీ థర్డ్‌ పార్టీ బ్రాండ్లయిన క్రాక్స్‌, స్కెచర్స్‌, క్లార్స్‌ను కూడా విక్రయిస్తోంది. కంపెనీ అవసరాలకు కూడా కొన్ని నిధులను వినియోగించనున్నారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఈ కంపెనీకి 134 నగరాల్లో 586 స్టోర్లు ఉన్నాయి. గత మూడేళ్లలోనే 211 స్టోర్లను తెరిచారు. మిడ్‌, ప్రీమియం సెగ్మెంట్లే లక్ష్యంగా ఈ సంస్థ వ్యాపారాన్ని విస్తరిస్తోంది.
1955లో నెలకొల్పిన ఈ కంపెనీ ప్రమోటర్లు రఫీక్‌ ఎ మాలిక్‌, ఫరా మాలిక్‌ భాంజి, ఆలిషా రఫిక్‌ మాలిక్‌తో పాటు వారి కుటుంబ ట్రస్ట్‌లు. ఇష్యూ డిసెంబర్‌ 22వ తేదీన లిస్ట్‌ కానుంది.ఆఫర్‌ ధరను కంపెనీ ఇంకా ఖరారు చేయాల్సి ఉంది.