10 ఐపీఓలు.. రూ.10,000 కోట్ల లక్ష్యం
పబ్లిక్ ఇష్యూల ద్వారా ప్రైమరీ మార్కెట్లో రూ.10,000 కోట్లకు పైగా సమీకరించడానికి 10 కంపెనీలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్, టెగా ఇండస్ట్రీస్ పబ్లిక్ ఇష్యూలు నడుస్తున్నాయి. గత నెలలో10 ఐపీఓలు విజయవంతం కాగా, ఈ నెలలో మరో పది కంపెనీలు రానున్నాయి. హైదరాబాద్‌కు చెందిన మెడ్‌ప్లస్, రేట్‌గెయిన్ ట్రావెల్ టెక్నాలజీస్, ఆనంద్ రాఠీ వెల్త్ వంటి ప్రధాన ఇష్యలూ కూడా ఉన్నాయి. మేదాంత హాస్పిటల్స్ మాతృ సంస్థ గ్లోబల్ హెల్త్, మెట్రోబ్రాండ్స్, శ్రీరామ్ ప్రాపర్టీస్, ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్, శ్రీభజరంగ్ పవర్ అండ్ ఇస్పాత్, వీఎల్సీసీ హెల్త్‌కేర్ కూడా ఐపీఓకు వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 51 కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.లక్ష కోట్లకు పైగా నిధులు సమీకరించాయి.