భారీ లాభాల్లో వాల్ స్ట్రీట్
ఒమైక్రాన్ భయాల నుంచి మార్కెట్లో తేరుకుంది. ఇవాళ వాల్‌స్ట్రీట్ ఆకర్షణీయ లాభాలతో ట్రేడవుతోంది. అన్ని సూచీలు 1.5 శాతం లాభంతో ఉన్నాయి. ఎస్ అండ్ పీ 500 సూచీ అన్నింటికన్నా అధికంగా 1.75 శాతం లాభంతో ట్రేడవుతోంది. ప్రైవేట్ పే రోల్స్ నవంబర్‌లో గణనీయంగా పెరగడంతో మార్కెట్ సెంటిమెంట్ మెరుగుపడింది. అలాగే యూరప్ మొత్తం 59 ఒమైక్రాన్ కేసులు నమోదు కాగా, అందరికీ తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉన్నట్లు వార్తలు వసత్ఉన్నాయి. కరెన్సీ మార్కెట్లో డాలర్ స్వల్పంగా క్షీణించింది. ఒపెక్ దేశాలు రెండు రోజుల సమావేశం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ రెండు శాతంపైగా లాభంతో ట్రేడవుతోంది. మరోవైపు బులియన్ మిశ్రమంగా ఉంది. వెండి ఒక శాతంపైగా క్షీణించగా, బంగారం స్వల్ప లాభంతో ఉంది.