లాభాల్లో ఆసియా.. మరి నిఫ్టి?
నిన్న భారీ అమ్మకాల తరవాత స్టాక్ మార్కెట్లు కోలుకుంటున్నాయి. అమెరికా మార్కెట్లు రాత్రి రెండు శాతం దాకా నష్టపోయాయి. ఇపుడు అమెరికా ఫ్యూచర్స్ స్వల్ప లాభాలతో ఉన్నాయి. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు కూడా రికవరీ మూడ్‌లో ఉన్నాయి. ప్రధాన మార్కెట్లు జపాన్, హాంగ్‌సెంగ్, దక్షిణ కొరియా సూచీలు ఆకర్షణీయ లాభాలతో ఉన్నాయి. చైనా డల్‌గా ఉంది. సింగపూర్ నిఫ్టి కూడా అరశాతం లాభంతో ఉంది. ఈ లెక్కన నిఫ్టి కూడా గ్రీన్‌లో ప్రారంభం కావొచ్చు. అయితే రాత్రి భారీ నష్టాలను మన మార్కెట్లు డిస్కౌంట్ చేస్తాయా లేదా ఫ్యూచర్స్ అనుగుణంగా పెరుగుతాయా అన్నది చూడాలి.