NIFTY TODAY: పెరిగితే అమ్మడమే
నిఫ్టి అయోమయంలో ఉంది. 17000 స్థాయిని కాపాడుకునే ప్రయత్నంలో ఉంది. హాంగ్‌సెంగ్ మన మార్కెట్ సెంటిమెంట్‌ను బాగా దెబ్బతీస్తోంది. పైగా భారీగా పడిన చైనా మార్కెట్ భారత మార్కెట్ కంటే ఆకర్షణీయంగా మారింది. దీంతో విదేశీ ఇన్వెస్టర్లు తాజా పెట్టుబడుల సంగతి అంటుంచి… ఉన్న పెట్టుబడులను ఉపసంహరిస్తూనే ఉన్నారు. దేశీయ ఆర్థిక సంస్థలు ఎంత వరకు నిఫ్టిని కాపాడుతాయనేది చూడాలి. ఇక ఇవాళ్టి ట్రేడింగ్ విషయానికొస్తే… ఒమైక్రాన్ భయాలు తగ్గుతున్నా… కార్పొరేట్ ఫలితాలు తరవాత మార్కెట్‌ను డ్రైవ్ చేసే అంశాలు ఏవీ లేవు. ఇక బడ్జెట్ వరకు ఆగాల్సిందే. నిఫ్టి క్రితం ముగింపు 17053. సింగపూర్ నిఫ్టి దాదాపు క్రితం స్థాయి వద్దే ఉంటోంది. కాబట్టి నిఫ్టి ఓపెనింగ్‌లో పెరిగినా, తగ్గినా లెవల్స్‌ను బట్టి ట్రేడ్ చేయడం మంచిది. నిఫ్టి ఇవాళ్టికి 17000 కీలకం. దిగువకు పడితే తొలి మద్దతు 16,930 ప్రాంతంలో రావొచ్చు. రిస్క్ తీసుకునేవారు ఇక్కడ కొనొచ్చు. లేదా వెయిట్ చేయొచ్చు. ఈ స్థాయిని కోల్పోతే నిఫ్టికి తదుపరి స్థాయి 16890 వద్ద మద్దతు అందాలి. 15 లేదా 20 పాయింట్ల స్టాప్‌లాస్‌తో పొజిషన్స్ తీసుకోవచ్చు. ఒకవేళ నిఫ్టి ఓపెనింగ్ఓల పెరిగితే 17,100 వరకు ఈజీగా చేరొచ్చు. తరవాత 17150 వద్ద ఒత్తిడి రావొచ్చు.ఈ స్థాయిని దాటితే 17,175 వద్ద చూడండి. ఇక్కడా పాతిక పాయింట్ల స్టాప్ లాస్‌తో అమ్మొచ్చు.నిఫ్టి గనుక 17,200ను దాటితే మార్కెట్‌కు దూరంగా ఉండండి. ఎలాంటి అమ్మకాలు చేయొద్దు. జస్ట్.. ఆల్గో ట్రేడింగ్ లెవల్స్‌కు పరిమితం అవ్వండి.