For Money

Business News

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలు అంటే ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్య కాలంలో బ్యాంకులు రూ. 46,382 కోట్ల వసూలు కాని బాకీలను రద్దు చేశాయి. లోక్‌సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్‌ కరద్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. నాలుగేళ్ళపాటు ఏ రుణమైనా వసూలు కాకుంటే…దాన్ని రద్దు చేసి.. బ్యాంకు ఆస్తిఅప్పుల పట్టీ నుంచి తొలగించాలనే ఆర్బీఐ నిబంధనల ప్రకారం వీటిని రద్దు చేసినట్లు ఆయన తెలిపారు. రుణాలను రద్దు చేసినా.. వాటి వసూలు కోసం బ్యాంకులు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయని మంత్రి చెప్పారు.గత మార్చి నెలాఖరు వరకు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో వసూలు కావాల్సిన రుణాల మొత్తం రూ. 3,34,171 కోట్లకు చేరుకుందని ఆయన తెలిపారు.