ట్విటర్ సీఈఓగా పరాగ్ అగర్వాల్
ట్విటర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) గా జాక్ డోర్సి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్‌ను నియమించారు. పరాగ్ అగర్వాల్ ఇప్పటి వరకు కంపెనీ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. జాక్ డోర్సి రాజీనామా చేస్తారని కొన్ని గంటల నుంచి వార్తలు వస్తున్నాయి. ఈలోగానే తాను రాజీనామా చేస్తున్నట్లు జాక్ డోర్సి ప్రకటించడంతో పాటు పరాగ్ అగర్వాల్‌కు అభినందనలు తెలిపారు. గడచిన పదేళ్ళ నుంచి కంపెనీలో పరాగ్ అద్భుతంగా పనిచేస్తున్నారని, అతని నైపుణ్యం అద్భుతమంటూ … పరాగ్ కంపెనీని నడిపే సమయం ఆసన్నమైందని డోర్సి అన్నారు. 16 ఏళ్ళ క్రితం నెలకొల్పిన ట్విటర్‌కు తొలిసారి వ్యవస్థాపకులు కాకుండా ఇతరులు సీఈఓగా నియమితులు కావడం ఇదే మొదటిసారి.