For Money

Business News

NIFTR TODAY: 17,600 దాటేనా?

ప్రపంచ మార్కెట్లు వీక్‌గా ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా బాండ్‌ ఈల్డ్స్‌ పెరుగుతున్నందున… వడ్డీ రేట్లు పెరిగే అవశాలు అధికమౌతున్నాయి. పైగా అమెరికా డాలర్‌ కూడా భారీగా పెరుగుతోంది. అక్టోబర్‌ నెలలో మ్యూచువల్‌ ఫండ్స్‌ లక్ష కోట్ల రూపాయల విలువైన షేర్లను అమ్మాయి. విదేశీ ఇన్వెస్టర్లు నిన్న కూడా భారీగా అమ్మారు. ఈ నేపథ్యంలో నిఫ్టి పెరిగినా నిలబడుతుందా అన్న అనుమానం పెరుగుతోంది. బుల్‌ రన్‌ కోసం నిఫ్టి 17,800 దాటే వరకు వెయిట్‌ చేయాల్సి ఉంటుందని టెక్నికల్‌ విశ్లేషకులు అంటున్నారు. ఇక ఇవాళ్టి ట్రేడింగ్‌ విషయానికొస్తే…నిఫ్టి ఇవాళ తొలి ప్రతిఘటన స్థాయి వద్ద ప్రారంభం కానుంది. నిఫ్టి క్రితం ముగింపు 17,503. నిఫ్టికి తొలి ప్రతిఘటన 17,564 వద్ద ఎదురు కానుంది. తరువాతి ప్రతిఘటన 17615. సో.. నిఫ్టి ప్రారంభమైన తరవాత కాస్సేపు వెయిట్‌ చేయడం మంచిది. నిఫ్టిని 17,630 స్టాప్‌లాస్‌తో నిఫ్టిని అమ్మొచ్చు. రిస్క్‌ తీసుకునేవారు కాస్త ముందుగానే అమ్మొచ్చు. నిఫ్టికి 17,400 వరకు ఎలాంటి మద్దతు లేదు. పైస్థాయిలో అమ్మకాల ఒత్తిడి వస్తే నిఫ్టి 17,425 దిగువకు వస్తుందేమో చూడండి. నిఫ్టి 17,400 స్థాయి దిగువకు పడితే 17355కి చేరొచ్చు. అన్ని టెక్నికల్‌ సూచీలు సెల్‌ సిగ్నల్‌ ఇస్తున్నాయి. రేపు నవంబర్‌ నెల డెరివేటివ్స్‌కు క్లోజింగ్‌. కాబట్టి చిన్న ఇన్వెస్టర్లు మార్కెట్‌కు దూరంగా ఉండటం మంచిది. ముఖ్యంగా నిఫ్టిలో ట్రేడింగ్‌ చేయకపోవడం మంచిది.